డిజిటల్ సర్వే ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

తిరుమలగిరి 04 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న ఫ్యామిలీ డిజిటల్ సర్వే కార్య క్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మునిపాలిటీ పరిధి లోని 9వవార్డు నందాపురం, మద్ది రాల మండలం రామచంద్రపురం గ్రామాన్ని ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చెసినట్లు జిల్లా కలెక్టర్ ఆదేశాను సారం తిరుమలగిరిమున్సిపాలిటి పరిధిలోని 9వ వార్డు లో డిజిటల్ సర్వేను మున్సిపల్ చైర్ పర్సన్ శాగంటి అనసూయ రాములు ప్రా రంభించారు. ఈ సందర్భంగా చైర్మ న్ శాగంటి అనసూయ రాములు మాట్లాడుతూ ఫ్యామిలీ డిజిటల్ సర్వేలో గృహా యజమానులు త మ కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డ్ వివరాలు,ఫొన్ నెంబర్లు సర్వే సిబ్బందికి ఇచ్చి ఫోటో దిగాలని చైర్మన్ అనసూయ రాములు అన్నారు.ఈ సర్వే ఐదు రోజులు ఉంటుందని చైర్మన్ తెలి పారు.ఈ కార్యక్రమంలో తహసి ల్దార్ హరి ప్రసాద్,మున్సిపల్ కమీ షనర్ మామిడి బుచ్చిబాబు,ఎంపీ డీవో లాజరస్,వార్డుకౌన్సిలర్ కన్నె బోయిన రేణుక లక్ష్మయ్య, వార్డు ఆఫీసర్ పాల్వాయి వెంకన్న, కౌన్సి లర్లు,అధికారులు,ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.