ఎన్ కౌంటర్ ని తీవ్రంగా ఖండించిన.

 CPI రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు MLA కూనంనేని సాంబశివ రావు

Sep 6, 2024 - 20:37
Sep 6, 2024 - 20:41
 0  4
ఎన్ కౌంటర్ ని తీవ్రంగా ఖండించిన.

 ఎన్ కౌంటర్ పేరుతో చంపేశారు:-కూనంనేనిరెండు రోజుల తేడాతో జరిగిన రెండు భారీ ఎన్ కౌంటర్ల పై కొత్తగూడెం MLA, భారత కమ్యూనిస్టు పార్టీ CPI రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివ రావు స్పందించారు. 

* ఎన్ కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తున్నామనీ, దేశంలో రాజ్యాంగ విరుద్ధ పాలన నడుస్తుందన్నారు. కొద్ది రోజుల క్రితం దేశంలో నక్సలైట్ల ను రూపుమాపుతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని, అందులో భాగంగానే ఈ ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని అన్నారు.


ఈ ఒక్క ఏడాదిలో (2024 లో) నే ఇప్పటి వరకు 150 మందికి పైగా ఎన్ కౌంటర్ల లో మృతి చెందడమే ఇందుకు నిదర్శనం అన్నారు.

* రెండు రోజుల క్రితమే 9 మందిని ఎన్ కౌంటర్  పేరుతో చంపేశారని, ఈరోజు మరో ఐదుగురిని చంపేశారని, ఇది కేంద్ర BJP దుర్మార్గమైన చర్య అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే ఇవి జరుగుతున్నాయని, వెంటనే వీటిని ఆపాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.


ప్రభుత్వం చేసే అన్ని పనులు కూడా సత్ఫలితాలు ఇవ్వడం లేదని, అలాగే నక్సలైట్ల వలన కూడా కొన్నిసార్లు తప్పిదాలు జరిగి ఉండవచ్చునని, అంత మాత్రాన అన్యాయంగా వారి ప్రాణాలు ఎలా తీస్తారని కూనంనేని సాంబ శివ రావు గారు కేంద్రాన్ని ప్రశ్నించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333