ట్రాఫిక్ నియమాలు పాటించాలి సిఐ రఘువీర్ రెడ్డి
తిరుమలగిరి 12 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తెలంగాణ చౌరస్తాలో సిఐ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలను మరియు కారులను తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా నాగారం సర్కిల్ సిఐ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు వాహనాదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు ఉండేలా చూసుకోవాలని ద్వేచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయవద్దని మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని పరిమితికి మించిన వేగంతో వెళ్ళవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు