జిల్లా సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు
జోగులాంబ గద్వాల 10 అక్టోబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి.శనివారం జరగబోయే విజయదశమి సందర్భంగా జిల్లా కేంద్రం లోని సాయుధ దళ కార్యాలయం లో ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ సతీసమేతంగా పాల్గొని ఆయుధ పూజ మరియు వాహన పూజ నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ప్రతి సంవత్సరం దసరా పండగ ముందు ఆయుధ పూజ నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు, సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీసు విభాగం నిరంతర కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ సిబ్బందికి, ప్రజలకు ముందస్తు గా దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి. ఎస్పీ సత్య నారాయణ , సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు , కార్యాలయ ఏ ఓ సతీష్ కుమార్ ఆర్ ఐ లు వెంకటేష్, హారిఫ్ , గద్వాల్ సిఐ నాగేశ్వర్ రెడ్డి, రూరల్ ఎస్సై శ్రీకాంత్,ఆర్ ఎస్ లు, మరియు సాయుధ దళ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.