చిన్నోనిపల్లి ఆర్&ఆర్ సెంటర్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు

Oct 10, 2024 - 21:34
 0  2
చిన్నోనిపల్లి ఆర్&ఆర్ సెంటర్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు

జోగులాంబ గద్వాల 10 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి. గట్టు. మండలం  చిన్నోనిపల్లి ఆర్ & ఆర్ సెంటర్ ను గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మరియు ఇంకుడు గుంతలు  నిర్మించుకొవాలని తెలిపారు.వీటి  మంజూరు కోసం తమ NREGS జాబ్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలు సెక్రటరీకి ఇచ్చి దరఖాస్తు ఇవ్వాలని తెలిపారు.దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి మంజూరు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చెన్నయ్య, ఏ పి ఓ స్వామి,మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ పంచాయతీ కార్యదర్శి మారెప్ప గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333