జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం
మహిళా సాధికారత, మహిళ అభ్యున్నతి కోసం ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ నిరంతర కృషి...మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న
అన్ని రంగాలలో మహిళలదే కీలక పాత్ర మహిళా శక్తిని కొనియాడిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆళ్లమురళి,వూకంటి గోపాలరావు, నాగ సీతారాములు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్న క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం మహిళా అభ్యున్నతి కోసం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ఆకాంక్షతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో నిరంతర కృషి సాగిస్తుందని చెప్పారు
75 ఏళ్ల స్వతంత్ర భారతా వనిలో ఇంకా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు వేధింపులు కు వ్యతిరేకంగా, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం మహిళా కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని చెప్పారు*
ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆళ్ళ మురళి, ఊకంటి గోపాలరావు, నాగ సీతారాములు, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ,సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి, చింతలపూడి రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, స్త్రీ లేనిదే సమాజ పురోగతి లేదని, స్త్రీ దైవంతో సమానమని తల్లిగా, చెల్లిగా, అక్కగా, స్త్రీలను గౌరవించాలని ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ శక్తి కీలకమని, శ్రీ లేనిదే కుటుంబ వ్యవస్థ లేదని, స్త్రీ ఔన్నత్యాన్ని కొనియాడారు*
మహిళా సమస్యల పరిష్కారం కోసం మహిళా కాంగ్రెస్ సాగించే ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని వారు భరోసా ఇచ్చారు*
ఈ సందర్భంగా కేక్ కటింగ్ తో పాటు స్వీట్లు పంచుకున్నారు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్నను నాయకులు పూలమాలలు వేసి సాల్వాలతో ఘనంగా సత్కరించారు*
ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు బాలిశెట్టి సత్యభామ మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు కొల్లు పద్మ, రుక్మిణి, భద్రమ్మ, తాటి పద్మ , అనూష, రమాదేవి, హేమ,వాణి రెడ్డి ,పుష్ప , స్వాతి రెడ్డి ,దివ్య, సుప్రియ, విద్య, విజయలక్ష్మి ,పుష్ప, శాంతి ఉమా, మరియు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పీతాంబరం ,సుందర్ రాజ్, కనకరాజు, జానీ భాష ,హరి సింగ్, బాల ప్రసాద్, కనుకుంట శ్రీనివాస్, వాసు, సత్యనారాయణ రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు*