పట్టణానికి వచ్చే ప్రజలు చలివేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలి

Mar 21, 2024 - 20:58
 0  6
పట్టణానికి వచ్చే ప్రజలు చలివేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలి

వివిధ పనుల నిమిత్తం సూర్యాపేట పట్టణానికి వచ్చే ప్రజలు పట్టణంలో పలు చోట్ల ఏర్పాటుచేసిన చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సుధాకర్ పివిసి అధినేత మీలా మహదేవ్ అన్నారు.  సుధాకర్ పివిసి ఆర్థిక సహకారంతో సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను వారు ప్రారంభించి మాట్లాడారు. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటున్నందున బాటసారులు ఇట్టి చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుధాకర్ పివిసి ఎంతోమందికి జీవనో భృతి కల్పించడమే కాకుండా ఎన్నో  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. మా వంతుగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333