మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు
TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, విధులకు ఆటంకం కలిగించడంతోపాటు బెదిరింపులకు గురి చేశారంటూ కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైన తెలిసిందే.