దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి
తిరుమలగిరి 27 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పెత్తందారీ దేశముఖ్, దొరల అణచివేత "లను ఎదిరించి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ అని తిరుమలగిరి మున్సిపాలిటీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేరాల వీరేష్ కొనియాడారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశాల మేరకు, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా పేరాల వీరేష్ మాట్లాడుతూ... "దున్నేవాడిదే భూమి" అనే నినాదంతో గర్జించి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తనదైన శైలిలో ఉద్యమించి పేద, బడుగు, బలహీన వర్గాల తరఫున పోరాటం చేసిన గొప్ప వీరవనిత ఐలమ్మ అని అన్నారు. ఆనాడు దొరలు వేల ఎకరాల భూములను తమ ఆధీనంలో ఉంచుకుని, పేదలతో వెట్టిచాకిరి చేయిస్తూ పొట్టకూటికి కూడా నోచుకోకుండా ఆకలి చావులకు కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులకు, భూమి లేని నిరుపేదలకు అండగా నిలబడి దొరల గుండెల్లో దడ పుట్టించిన చరిత్ర ఆమెదని పేర్కొన్నారు.నేటి మారుతున్న కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, సమాజంలో పేద, బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు, అవినీతిపై ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో
పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో తిరుమ లగిరి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్సోజు నరేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమీలాల్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి దుంపల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ జేరిపోతుల శోభారాణి, 7వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్, మున్సి పాలిటీ వార్డు ఇన్చార్జీలు మూల రాజు, కడెం మల్లయ్య, కందుకూరి లక్ష్మయ్య, ముద్రబోయిన ఉప్పలయ్య, పత్తేపురం సుధాకర్, మాజీ కౌన్సిలర్లు గుగులోతు భాస్కర్ నాయక్, వీర్ నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు నాయిని కృష్ణ పాల్గొన్నారు. అలాగే గ్రామ సర్పంచులు రామోజీ నాయక్, చిరంజీవి నాయక్, బిచ్చు నాయక్, బానోత్ రోజా లక్ష్మణ్, సుజాత రాజశేఖర్ నాయక్, జలాల్పురం గ్రామ శాఖ అధ్యక్షుడు దాచేపల్లి శ్రీను, రాఘవపురం గ్రామ శాఖ అధ్యక్షుడు భీమా నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు పేరాల నరేష్, సంత్ సేవాలాల్ మండల అధ్యక్షుడు బానోతు రాములు నాయక్, ఉడుగు రోహిత్, బుక్య పరదేశి, రాకేష్, సాయిలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.