జర్నలిస్ట్ చూపు 14 వ వార్డు అభివృద్ధి వైపు
తిరుమలగిరి 31 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్
గత రెండు దశాబ్దాలుగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉంటూ తిరుమలగిరి మున్సిపాలిటీ, మండల అనేక సమస్యలపై వెలుగులోకి తీసుక వచ్చి, సంబంధిత అధికారులతో పనులు శ్రీకారం చుట్టిన యంగ్ డైనమిక్ యువ టైగర్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ కులాల పెదరేషన్ రాష్ట్ర కోశాధికారి పసుపులేటి కరుణాకర్ మున్సిపల్ ఎన్నికలో ప్రజాప్రతినిధిగా కాబోతున్నారు..మున్సిపల్ ఎన్నికలు సందర్భంగా శుక్రవారం నాడు తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో 14 వార్డు కు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా అక్షరమే ఒక ఆయుదంగా మార్చుకొని తన కలంతో గళాన్ని ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మున్సిపల్ , మండల పరిధిలోని, అనేక సమస్యలను పరిష్కరించానని తెలిపారు. నిత్యం ప్రజలతో మమేకమైన తనను 14 వార్డు ప్రజలు ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కరుణాకర్ కోరారు.