ఛీ..చీ.. 400 మంది విద్యార్థినీలకు 4 బాత్రూములే

తుంగతుర్తి 02 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో400 మంది విద్యార్థినీలకు నాలుగు బాత్రూంలే పనిచేయడంతో విద్యార్థినీలు అనునిత్యం ఆవస్తలు పడుతున్నారు. ఈ సంఘటన పత్రికల ద్వారా విషయం తెలుసుకున్న తహసిల్దార్ దయానందం మంగళవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో 603 మంది విద్యార్థినీలు అడ్మిషన్ పొందగా 416 మంది విద్యార్థినీలు హాజరయ్యారు. గురుకులంలో 650 మంది విద్యార్థినీలకు 72 బాత్రూములు నిర్మాణం చేశారు .కానీ వాటిలో నాలుగు మాత్రమే పనిచేయుచున్నాయి.