డి.ఎం.హెచ్.ఓ (DM&HO) డాక్టర్.ఎస్.కె.సిద్ధప్ప చేతుల మీదుగా న్యూట్రిషన్ కిట్లు పంపిణీ

Sep 2, 2025 - 18:45
 0  12
డి.ఎం.హెచ్.ఓ (DM&HO) డాక్టర్.ఎస్.కె.సిద్ధప్ప చేతుల మీదుగా న్యూట్రిషన్ కిట్లు పంపిణీ

 జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా క్షయ నివారణ కేంద్రం లో డి.ఎం.హెచ్.ఓ (DM&HO) డాక్టర్.ఎస్.కె సిద్ధప్ప మరియు డాక్టర్ జి. రాజు టీబి ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 19 మంది టీబి బెనిఫిషరీస్ కు  క్యూభ్ రూట్ ఫౌండేషన్  వారు న్యూట్రిషన్ కిట్లు టీబి పేషెంట్స్ కు ఇవ్వడం జరిగినది.

డి.ఎం.హెచ్.ఓ (DM&HO)  టీబీ వ్యాధి పట్ల  అవగాహన కలిగించారు.

క్షయ వ్యాధిగ్రస్తులకు ట్రీట్మెంట్ తో పాటు పౌష్టిక ఆహారం ఎంతో కీలకమైనది. 

క్షయ వ్యాధిగ్రస్తులు ట్రీట్మెంట్ తో పాటు పౌష్టిక ఆహారం సమతుల్యంగా తీసుకుంటే కచ్చితంగా గెలుస్తారు.

క్షయ వ్యాధి ఎక్కువ శాతం పేద ప్రజలకు సోకుతుంది కాబట్టి పేద టీబి ప్రజలను గుర్తించి న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వడం జరిగినది.

టీబీ చికిత్సకాలం 6 నెలల వరకు ప్రతినెల అందజేయడం జరుగుతుంది.

 ఈ సందర్భంగా , డి.ఎం.హెచ్.ఓ (DM&HO) మాట్లాడుతూ జిల్లాలో ఉన్న దాతలు ముందుకు వచ్చి టీబి పేషెంట్లను దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు. ఇట్టి కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ (DM&HO) డాక్టర్.ఎస్.కె సిద్ధప్ప, మెడికల్ సూపర్ ఇంటెండెంట్ డాక్టర్ ఇందిరాని ,డాక్టర్ జి. రాజు టీబి ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్ అభినేష్, డాక్టర్ శరత్ పల్మనాలజిస్ట్, డాక్టర్ హేమలత, డాక్టర్ మాధుర్య, కృష్ణయ్య హెల్త్ అసిస్టెంట్ మరియు NTEP స్టాఫ్, ASHA's తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333