ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

తిరుమలగిరి 02 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :
సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని మాచిరెడ్డిపల్లే గ్రామానికి చెందిన వడ్డే క్రిష్ణ (25) తండ్రి సోమయ్య, వృత్తి వ్యవసాయం అనే యువకుడు తన పొలానికి యూరియ బస్తాల కోసం నిన్న మధ్యాహ్నం సమయంలో తిరిమలగిరికి వచ్చి, తిరిగి సాయంత్రం సమయంలో తిరుమలగిరి నుండి ఒక్కడే ఒంటరిగా నడుచుకుంటూ తన గ్రామానికి వెళ్లడానికి రాత్రి అందాజ 10.30 గంటల వరకు తిరుమలగిరి శివారులో సూర్యపేట మరియుు జనగాం రహదారిిి వెంట ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళేసరికి, అదే సమయంలో రోడ్డుపై నుండి వెళుతున్న గుర్తుతెలియని వాహనం అతనిని డి కొట్టడంతో, తలకు తీవ్రమైన రక్త గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందడంతో ఇట్టి విషయం తన కుటుంబ సభ్యులకి తెలియపరచడంతో, మృతుని తల్లి వడ్డే అంజమ్మ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు తిరుమలగిరి ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు.....