రిటైర్డ్ ఉద్యోగుల  సమస్యలు పరిష్కరించాలి 

Aug 20, 2024 - 18:31
Aug 20, 2024 - 18:31
 0  70
రిటైర్డ్ ఉద్యోగుల  సమస్యలు పరిష్కరించాలి 

ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 

 డిఏ బకాయిలు క్వాంటం పెన్షన్  మంజూరు చేయాలి 

టాప్రా లో టీఎస్ యూటీఎఫ్ లో గడ్డం వెంకట్ రెడ్డి సేవలు చిరస్మరణీయం....టాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి

టాప్రా ,టీఎస్ యూటీఎఫ్ ల  ఆధ్వర్యంలో ఘనంగా గడ్డం వెంకట్ రెడ్డి సంతాప సభ 

 రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం జాప్యం చేయకుండా పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి అన్నారు మంగళవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో టాప్రా ,టీఎస్ యూటీఎఫ్  కోదాడ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్గీయ గడ్డం వెంకట్ రెడ్డి సంతాప సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే ప్రతి ఫలాలు చెల్లించాలని కోరారు. గత మార్చి నెల నుండి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు నేటి వరకు బెనిఫిట్స్ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు డి ఏ బకాయిలు క్వాంటం పెన్షన్ హెల్త్ కార్డులు సమస్యలను పరిష్కరించాలన్నారు గడ్డం వెంకట్ రెడ్డి మృతి టాప్రా పోరాటాలకు తీరని లోటు అన్నారు. యుటిఎఫ్ సంఘంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ లో గడ్డం వెంకట్ రెడ్డి చేసిన సేవలను స్మరించారు. అనంతరం పలు  సోదర సంఘాల నాయకులు వెంకటరెడ్డి తో తమకున్న  అనుబంధాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో టాప్రా రాష్ట్ర ఉపాధ్యక్షులు సీతారాములు జిల్లా అధ్యక్షులు సోమయ్య ,జిల్లా కార్యదర్శి చుండూరు ప్రసాద రావు,టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ నల్గొండ జిల్లా టాప్ర అధ్యక్షులు జగదీష్ ,కోదాడ డీవిజన్ టాప్ర అధ్యక్ష కార్యదర్శులు శివరామయ్య టి వీరబాబు యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి పౌరస్ స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.ఏ మంగ,జిల్లా అధ్యక్షుడు ఆర్ ధనమూర్తి, తులసి రామ్ ,పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య ముత్తవరపు రామారావు రామ నరసయ్య యుటిఎఫ్ సంఘంలో పలు హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333