చిలుకూరు సహకార సంఘం కార్యాలయంలో రైతుల ఆందోళన...

Sep 26, 2024 - 10:40
 0  8
చిలుకూరు సహకార సంఘం కార్యాలయంలో రైతుల ఆందోళన...

(సెప్టెంబర్ 25, తెలంగాణ వార్త రిపోర్టర్ చిలుకూరు)  కోదాడ నియోజకవర్గం పరిధిలోని చిలుకూరు పిఎసిఎస్ కార్యాలయంలో 41 మంది రైతులకు రుణమాఫీ కాలేదని అధికారులను విధుల్లో ఉంచి కార్యాలయానికి  రుణమాఫీ కానీ రైతులు తాళం వేసి నిరసన వ్యక్తం తెలిపారు .ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, సీఈవో లక్ష్మీనారాయణ నిర్లక్ష్యం వల్లనే రుణమాఫీ జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు కార్యాల చుట్టూ తిరిగిన సరైన సమాధానం చెప్పక ఇబ్బందులు గురి చేశారని  వారు తెలిపారు.  రైతులు నిరసన చేస్తున్న సమాచారం ను తెలుసుకున్న సీఐ రజిత రెడ్డి పిఎసిఎస్ కార్యాలయానికి వెంటనే చేరుకొని రైతులతో కార్యాలయం కు వేసిన తాళం తీపిచ్చి విధుల్లో ఉన్న సిబ్బందిని డైరెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను మందలించి చట్టపరంగా మీరు చేస్తున్నది తప్పు అని రుణమాఫీ కాకపోతే ప్రజాప్రతినిధులు సొసైటీ చైర్మన్ సిబ్బందితో రుణమాఫీ అయ్యేవిధంగా పనులు చేయించుకోవాలి కానీ ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం తప్పని అని అన్నారు. ప్రభుత్వ అధికారుల విధుల్లో భంగం కల్పించినందుకు 11 మంది రైతుల ను ఆటోలో పోలీస్ స్టేషన్కు తరలించి వారిని మందలించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సిఐ రజిత రెడ్డి తెలిపారు . సీఈఓ లక్ష్మీనారాయణ ని వివరణ అడుగగా రుణమాఫీ అయ్యేవిధంగా ఆన్లైన్ చేశామని పై బ్యాంకులలో అప్రూవల్ గాక ఆగాయని అవి మరలా పంపించామని త్వరలో కచ్చితంగా రుణమాఫీ అవుతాయని రైతులు అధైర్య పడవద్దని వారు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333