రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం

Aug 13, 2024 - 19:50
 0  3
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం

ప్రచురాణార్థం
ఈ రోజు ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాల (TW), భద్రాచలం లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఆధ్వర్యం లో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ.కమల్ ప్రసాద్ పట్నాయక్ , రీజినల్ డైరెక్టర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తుకు మూల స్తంభాలు అన్నారు. ఈ రోజు సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక అక్షరాస్యత అవసరం అన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆర్థిక వ్యహారాల్లో అవగాహన కలిగి ఉంటే, వారు కొన్ని వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దుతారు. 2047 సంవత్సరానికి భారత్ వికసిత భారత్ గా రూపుదిద్దుకోవాలంటే, ప్రతి భారతీయుడు ఆర్థిక క్రమశిక్షణతో మెలగడం ద్వారా, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించవలసి ఉంటుందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో మాత్రమే ఆర్థిక వ్యవహారాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఆర్థిక అక్షరాస్యత కు సంబంధించిన పుస్తకాలు కళాశాల లైబ్రరీకి బహుకరించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కళాశాల ఆవరణలో పచ్చదనం పెంచడంకోసం కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు.

జగదీష్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యార్థినీ విద్యార్థులకు బ్యాంకులు అందిస్తున్న వివిధ సేవలు, రిజర్వ్ బ్యాంక్ పాత్ర, బంగారు భవష్యత్తుకు ఆర్థిక సూత్రాలు,  విద్యారుణాలు, సైబర్ భద్రతకు తీసుకోవలసిన జగ్రత్తలు వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సపల్ డా .వీరా నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, రిజర్వ్ బ్యాంక్ మేనేజర్లు పృథ్వి, అలి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333