రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కొత్తపల్లి ఆంజనేయులు అలియాస్ అంజి - ఉపాధ్యక్షులుగా నరసింహులు కేఎన్ఆర్
ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు తీసుకున్న స్వామి నాయుడు - SVR రాజు
బాధ్యతలు తీసుకున్న నూతన కార్యవర్గం
జోగులాంబ గద్వాల 19 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం నూతన కమిటీని ఆదివారం రోజు రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడిగా కొత్తపల్లి ఆంజనేయులు అలియాస్ అంజి, ఉపాధ్యక్షులుగా నరసింహులు (కేఎన్ఆర్) ప్రధాన కార్యదర్శులుగా స్వామి నాయుడు, SVR రాజు యాదవ్ లు ఆదివారం రోజు ప్రమాణ స్వీకార అనంతరం బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వీరితోపాటు నూతన కార్యవర్గం ను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కు సంబంధించి ప్రతి ఒక్కరికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సన్మాన కార్యక్రమాల అనంతరం అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ.. రెండవసారి కూడా నాపై నమ్మకం ఉంచి నన్ను ఆదరించి నాపై ప్రేమ ఆదరాభిమానాలు చూపించి ఏకగ్రీవంగా అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించే దిశగా పనులు చేస్తానని అందరము కలిసికట్టుగా పని చేసుకుందామని ఏ సమస్య అయినా సరే తన సమస్యగా భావించి పరిష్కరించే దిశగా పనులు చేపడతానని అందరము కలిసికట్టుగా ముందుకు నడిస్తే మన సంఘం మరింత బలోపేతం అవుతుందని ఈ సన్మాన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అందరూ పాలు పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులతోపాటు సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, సలహాదారులు మరియు కార్యదర్శులు నూతన కార్యవర్గం సభ్యులు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.