చిన్నోని పల్లి గ్రామస్తులను ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నాది ఎమ్మెల్యే

Sep 8, 2024 - 21:51
Sep 8, 2024 - 21:52
 0  10
చిన్నోని పల్లి గ్రామస్తులను ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నాది ఎమ్మెల్యే

 మీ త్యాగం మరువలేనిది 

చిన్నోనిపల్లి గ్రామస్తులకు అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తాం ఎమ్మెల్యే  

జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గట్టు మండలం పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామం ముంపుకు గురి కావడంతో అకాల వర్షం రావడంతో గ్రామంలో ఇండ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు నివసించడానికి ఇబ్బందిగా ఈ సందర్భంలో ఎమ్మెల్యే  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చిన్నోనిపల్లి గ్రామాన్ని సందర్శించి జరిగినది.  చిన్నోనిపల్లి గ్రామస్తులకు 250 మందికి రేపు 7500 రూపాయలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఇల్లులు ఖాళీ చేసిన సందర్భంగా రవాణా ఖర్చుల కొరకు మాత్రమే ప్రభుత్వ నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. 

ఎమ్మెల్యే  మాట్లాడుతూ.... చిన్నోనిపల్లి గ్రామస్తులకు  గతంలో కూడా చెప్పడం జరిగింది. రిజర్వాయర్లు ఇబ్బంది కలుగుతుందని గతంలో మీకు ఆర్ అండ్ ఆర్ సెంటర్ ని ఏర్పాటు చేసి మంచి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. రిజర్వాయర్లు దాదాపుగా 70% పూర్తయినది ఇప్పుడు అకాల వర్షం కారణంగా గ్రామంలో ఉన్న ఇండ్లలోకి  నీళ్లు రావడంతో ప్రజలకు ఇబ్బందిగా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కచ్చితంగా గ్రామాన్ని ఖాళీ చేసి నూతనంగా నిర్మాణం అవుతున్న ఆరె&ఆరె సెంటర్లో వెళ్లాలని కోరారు. 

  చిన్నోనిపల్లి గ్రామస్తులకు ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని షిఫ్ట్ ఇన్ చార్జెస్, ఇల్లులు, పట్టాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వచ్చే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసే విధంగా నా వంతు కృషి చేస్తానని ఆర్ అండ్ ఆర్ సెంటర్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో నీరు విద్యుత్, సరఫరాను కల్పిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఇళ్లను అందించే విధంగా ప్రభుత్వం తరఫున నా వంతు కృషి చేస్తామని తెలిపారు. 
 గతంలో ఆలూరు లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడినది అప్పుడు వారికి ఏ విధంగా అయితే అన్ని రకాల మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేసి నూతన ఆర్ఎంఆర్ సెంటర్ ను ఏ విధంగా చేయడం జరిగిందో అదే విధంగా మీ గ్రామానికి కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసి ఆర్ అండ్ ఆర్ సెంటర్ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని తెలిపారు. 
 గ్రామస్తులు ప్రతి ఒక్కరు మాకు సహకరించాలి ఇతరుల మాటలు విని మీరు నష్టపోకండి మాకు సహకరించండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది అని పేర్కొన్నారు. 
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకువెళ్లి  రెండు మూడు  నెలల్లో చిన్నోనిపల్లి గ్రామస్తుల సమస్యలను పరిష్కరించి విధంగా కృషి చేస్తూ ప్రతి ఒక్కరికి ఇండ్లను ఇళ్ల పట్టాలను అందించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ని ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి పటేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్, నాయకులు దేవేందర్, భగీరథ వంశీ, , వీరేష్, సెడ్రీక్,ముని చంద్ర గౌడ్, గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State