ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలి డాక్టర్ రాధిక

Feb 6, 2026 - 19:39
 0  2
ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలి డాక్టర్ రాధిక
ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలి డాక్టర్ రాధిక

 జోగులాంబ గద్వాల 6 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇటిక్యాలలో డాక్టర్ రాధిక ఆధ్వర్యంలో ఆశా డే మీటింగ్ జరిగినది ఈ మీటింగ్ లMLHPs,supervisors,HAts,ANMs,&Ashas అందరూ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా డాక్టర్ రాధిక మాట్లాడుతూ  ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను గుర్తించడం వారికి ఆరోగ్య పరీక్షలను చేయించడం మరియు మందులను పంపిణీ చేయాలని వైద్య సిబ్బందికిసూచించారు. గర్భిణీ స్త్రీలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇటిక్యాలకు 102 వాహనం ద్వారానే తీసుకురావాలని సూచించారు.మరియు ఆరోగ్య సమస్యలున్న గర్భిణీ స్త్రీలను గద్వాలకు తీసుకువెళ్లాలని సూచించారు. మరియు ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలని సూచించారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళరాదని సూచించారు మరియు 30 సంవత్సరములు పైబడిన వారందరి కి బీపీ, షుగర్ పరీక్షలు చేయాలని సూచించారు ఎవరికైనా బిపి, షుగర్ వ్యాధులు ఉన్నచో వారికి మందులను మన పీహెచ్సీలో ఇప్పించాలని సూచించారు.
 మరియు వేరే ఇతర వ్యాధులు ఉన్నచో వారిని కూడా గుర్తించి పీహెచ్సీకి పంపాలని సూచించారు.
 ఈ విధంగా మిగతా ఆరోగ్య కార్యక్రమా లన్ని 100% పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి ఆశ కార్యకర్తలకు  సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333