చిట్ ఫండ్ పేరుతో ప్రజలను మోసం చేసిన నిందితుని అరెస్ట్
మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి.
మహబూబాబాద్, 10 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- చీట్టిల (Chit Fund) పేరుతో ప్రజలను మోసం చేసి డబ్బులు అక్రమంగా వసూలు చేసిన నిందితుడిని మహబూబాబాద్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళితే నిందితుడు అజ్మీరా మంగీలాల్, S/o హరిసింగ్, R/o హరికిషన్ మిల్ రోడ్, మహబూబాబాద్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి 2017 సం,, నుండి ఓం శ్రీమన్నారాయణ చిట్ ఫండ్ ప్రై,,లి అనే పేరుతో చీట్టిల వ్యాపారం చేస్తూ ప్రజలను ఆకర్షించి, అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి పలువురి వద్ద నుండి డబ్బులు వసూలు చేసి ఎత్తుకున్న చిట్టీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్టు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నిందుతునిపై టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, మోసం చేసినట్లు ఒప్పుకొనగా, నిందితుడి వద్ద నుండి సంబంధిత పత్రాలు మరియు రిజిస్టర్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించడం జరిగిందని తెలిపారు. మరియు ప్రజలు ఇలాంటి చీట్టిలలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి కోరారు.