రెండవ రోజు ఉదయం మనోపాడ్ మండలంలో కొనసాగిన ప్రజా పాలన - ప్రగతి నివేదిక బస్సు యాత్ర
వందలాదిగా హాజరైన కాంగ్రెస్ అభిమానులు
గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటాం.
రాజకీయాల్లోకి కి వచ్చింది స్వలాభం కోసం కాదు ప్రజా సేవ కోసం...
రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం.
జోగులాంబ గద్వాల 3జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : మానవపాడు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ మల్లు రవి గారు చేపట్టిన ప్రజా పాలన -ప్రగతి నివేదిన బస్సు యాత్ర రెండవ రోజు అలంపూర్ నియోజక వర్గంలో ఉదయం మానవపాడు మండలంలో కొనసాగింది.
ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ...!
ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవు అయినప్పటికీ ప్రజలను కలవడానికి ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రజా క్షేత్రంలో ప్రజల మరియు నియోజక వర్గ ప్రాంత సమస్యలు తెలుసుకోవడం కొరకు ప్రతి మండలాన్ని బస్సు పర్యటన ద్వారంపర్యటిస్తున్నాం అన్నారు.
అలంపూర్ నియోజక వర్గ ప్రజలు ఎంపి మల్లు రవి ని కాంగ్రెస్ పార్టీని బలపరచి గెలిపించినందుకు గానీ అలంపూర్ నియోజక వర్గానికి ఎంపీ నిధుల నుంచి ఎక్కువ మొత్తాన్ని కేటాయించిడం తో పాటు ,అలంపూర్ ప్రాంత అభివృద్ధి కొరకు మరింత ఎక్కువ. కృషి చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలనలో అలంపూర్ నియోజక వర్గంలో నేను ఓడిపోయినప్పటికీ నా ప్రాంత ప్రజలు ఓడిపోకూడదు అభివృద్ధి లో వెనుకబడి ఉండకూడదు అని ముఖ్యమంత్రి తో మాట్లాడి నిధులకు తీసుకు రావడం జరుగుతుంది అని అన్నారు . నియోజక వర్గం లో 3500 ఇళ్ళను నిర్మించి యిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు .
ఓట్లు వేసుకుని ప్రజలను మోసం చేసి ఎమ్మెల్యే అయిన విజయుడు కానీ ,ఓట్లు వేయమని యిల్లు యిల్లు తిరిగిన ఎమ్మెల్సీ చల్లా కానీ ఏ ఒక్క రోజు ప్రజల కష్టాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు .
యిప్పటికీ అయినా నియోజక వర్గ ప్రజలు మేలుకుని మాయ మాటలకు ,మందు సీసాలకు వాళ్ళ ఓటును అమ్ముకుని వల్ల అభివృద్ధి నీ దూరం.చేసుకోవద్దని ఆలోచన చేయాలని అన్నారు .
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పై ప్రచారం నిర్వహిస్తూ, బస్సు యాత్ర ముందుకు సాగింది.
ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా డిసిసి అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మెన్ నీలి శ్రీనివాసులు ,నగర్ కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జి మధు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నల్లా రెడ్డి,మున్సిపల్ వైస్ ఛైర్మన్ శంకర్ , అలంపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కుమార్ ,మానవపాడు మండల అధ్యక్షులు జగన్ మోహన్ నాయుడు,పల్లి సతీశ్ రెడ్డి , వివిధ గ్రామాల సర్పంచులు,మాజీ సర్పంచులు ఎంపీటీసీ లు తదితరులు హాజరయ్యారు.