ఘనంగా సన్మానించిన మున్సిపల్ సిబ్బంది

తిరుమలగిరి 20 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీకి అవార్డుల పంట పండింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విషయం తెలిసిందే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మరియు వార్డ్ ఆఫీసర్ గా తమ విధుల పట్ల ప్రతిభ కనబరిచినందుకుగాను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి మరియు కలెక్టర్ చేతుల మీదుగా పంగ శోభ కు ఉత్తమ అవార్డు లభించడంతో హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ మరియు అధికారులు శాలువాతో వారిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు