రోడ్ల మరమ్మతులు చేపట్టాలని న్యూడెమోక్రసీ రాస్తారోకో

Aug 20, 2025 - 08:04
 0  9
రోడ్ల మరమ్మతులు చేపట్టాలని న్యూడెమోక్రసీ రాస్తారోకో

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  నేమ్మికల్ దండు మైసమ్మ గుడి వద్ద కల్వర్టు తో పాటు రోడ్డు అకాల వర్షాలు, వరదల వలన ద్వంశమైందని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, కలవర్టు, బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రోడ్డు పై రాస్తారోకో నిర్వహించి , ఆ రహదారి పై వెళ్తున్న ఆర్ & బి, డి ఈ గారికి సమస్యను వివరించారు.తక్షణమే పరిష్కరించాలని కోరారు. *ఈ సందర్భంగా ఐఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంకా రోడ్లు, బ్రిడ్జిలు, కలవర్టు లు నిర్మాణం చేపట్టడంలో వైఫల్యం చెందారని అన్నారు. అకాల వర్షాలు, వరదల వలన రహదారులపై రోడ్లు ధ్వంసం కావడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దండు మైసమ్మ గుడి వద్ద కల్వర్టు కు ఇరువైపుల భూమి ఆక్రమణకు గురికావడంతో తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు .ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె వెంకన్న, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ నాగయ్య పి ఓ డబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ, ఐ ఎఫ్ టి యు జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి, పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి గిరి బాబు,మర్రి శంకర్ తదితరులు పాల్గొన్నారు.*