వికలాంగుల హక్కుల సమస్యలు పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయండి

May 8, 2025 - 18:44
 0  17
వికలాంగుల హక్కుల సమస్యలు పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయండి

భువనగిరి 08 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-  ఎన్. పి.ఆర్.డి.జిల్లా కోశాధికారి కొత్త లలిత 16,17 న ధర్నా, ముట్టడి కార్యక్రమం కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. గురువారం రోజు భువనగిరి టౌన్ 6,7 వార్డులలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి టౌన్  కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 16 ,17 తేదీల్లో జరగబోయే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి విజయవంతం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది.

      ఈ సందర్భంగా ఎన్.పి.ఆర్.డి. జిల్లా కోశాధికారి కొత్త లలిత  మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులందరికీ అంథోదయ్యా రేషన్ కార్డ్స్ ఇచ్చి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి దాంట్లో కూడా వికలాంగులకు స్పెషల్ కోట లో వికలాంగులకు ఇండ్లు కూడా మంజూరు చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా 2010 నుండి పెన్షన్ పొందుతున్న ప్రతి వికలాంగులకి యూ డి ఐ డి కార్డు పంపిణీ చేయాలని స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసిన వారికి వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో వికలాంగులతో ప్రత్యేకంగా శ్రమ శక్తి సంఘాలను ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు జారీ చేసి 150 రోజులు పని కల్పించాలి రోజుకు 600 ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలతో సతమతమవుతున్న వికలాంగులకు చేయూతనిచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఎన్పిఆర్డి గా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈనెల 16 17 తేదీల్లో జరగబోయే ధర్నాకు అనేకమంది వికలాంగులు వచ్చి తమ ఆవేదనని చెప్పుకోవాలను కూడా మండల వికలాంగులకు పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్. పి.ఆర్. డి భువనగిరి టౌన్ 6వ వార్డు నాయకులు పోచమ్మ కళ్యాణి శిరీష లక్ష్మీ సంధ్య గంగయ్య వెంకటేష్ జాంగిర్ స్వరూప 7వ వార్డు నాయకులు రామచంద్ర ఆర్ రమేష్ పల్లెపాటి భాగ్యమ్మ ఆ రాధిక శ్రీకాంత్ ఆర్ సునీత తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333