వయనాడ్‌ విలయంలో 47 మంది జలసమాధి

Jul 30, 2024 - 19:36
 0  1
వయనాడ్‌ విలయంలో 47 మంది జలసమాధి

విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

 కేరళలోని  వయనాడ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో 47 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు మోదీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితి, అక్కడ సాగుతున్న సహాయకచర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి అన్నివిధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎక్స్‌ వేదికగా తెలిపారు.

మరోవైపు ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందినవారికి పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్‌ కింద రూ.2 లక్షలు పరిహారం చెల్లిస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. క్షతగాత్రులకు రూ.50,000 ఇవ్వనున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333