ఎమ్మార్వో శేషగిరిరావుకి వినతి పత్రం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

Aug 30, 2025 - 18:36
 0  64
ఎమ్మార్వో శేషగిరిరావుకి వినతి పత్రం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

 అడ్డగూడూరు 30 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి అడ్డగూడూరు మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో తాసిల్దార్ శేషగిరిరావుకి వినతి పత్రం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ నేతలు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, చిప్పలపల్లి మహేంద్ర నాథ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మోత్కూర్,వారు మాట్లాడుతూ..మంజూరైనా తాసిల్దార్ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం,పోలీస్ స్టేషన్,కార్యాలయాలను మండల కేంద్రానికి దూరంగా దాదాపు 2 కిలోమీటర్లు దూరం ధర్మారంకి వెళ్లే దారిలో(పెద్ద లైన్ స్థంబాల సమీపంలో)ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని మండల అభివృద్ధికి సహకరించాలని కోరినారు.ఉమ్మడి మోత్కూర్ మండల కేంద్రానికి నిత్యం వెళ్లి రావడానికి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేసిన తరువాత 2016 టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రత్యేక చొరువతో అడ్డగూడూరు నూతన మండలంగా ఏర్పాటు చేసినారు.అడ్డగూడూరు మండల కేంద్రం నుండి మోత్కూర్ రోడ్డులో సర్వే నెంబర్ 276లో ఒక ఎకరం భూమి దాత గుండా శ్రీనివాస్ 2017లోనే తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలకు భూమి ఇచ్చినారు.అలాగే అడ్డగూడూరు ప్రభుత్వ దవఖాన వెనుకాల సర్వే నెంబర్ 149లో పోలీస్ స్టేషన్ కి మరియు అగ్రికల్చర్ ఆఫీస్ కి స్థలం 2018 లోనే కేటాయించడం జరిగింది.ప్రజల సౌకర్యంగా ఉండే స్థలంలో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. ప్రజా ప్రభుత్వంలో అడగడానికి స్వేచ్ఛ లేకుండా పోయింది ఎమ్మార్వో ను కలవడానికి మేము వెళ్లే క్రమంలో పోలీస్ లతో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వినతి పత్రాలు కూడా ఇచ్చే స్వేచ్ఛ లేకుండా పోయింది అని విమర్శించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు,మండల ప్రధాన కార్యదర్శి చెవుగోని సత్యం గౌడ్, మాజీ ఎంపిటిసి పూలపెల్లి జనార్దన్ రెడ్డి,మాజీ సర్పంచ్ లు కుమార స్వామి, కడారి సైదులు,ఖమ్మం పాటి పరమేష్ టిఆర్ఎస్ మండల నాయకులు బాలెంల అయోధ్య,బాలెంల బాబు మహాజన్,ఎల్లంల వీరస్వామి,నాగులాపెల్లి దేవగిరి,గజ్జెల్లి రవి, జక్కుల యాదగిరి, ఎలందర్,నాగయ్య,గూడెపు నరేష్,పోలేపాక అబ్బులు,వరిగడ్డి లోకేష్,మందుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333