ఆశా వర్కర్ల అరెస్టును ఖండించిన మాజీ ఎంపీపీ,జెడ్పిటిసి

Jul 30, 2024 - 20:56
Jul 30, 2024 - 21:33
 0  4
ఆశా వర్కర్ల అరెస్టును ఖండించిన మాజీ ఎంపీపీ,జెడ్పిటిసి

30-07-2024 తెలంగాణ వార్తా ప్రతినిధి చిన్నంబావి మండలం.:- చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన వెలగొండ గ్రామంలో   ఆశ వర్కర్ల అరెస్టులును కండించిన చిన్నంబావి మండల మాజీ ఎంపిపి సోమేశ్వరమ్మ మాజీ జడ్పిటీసి కేసిరెడ్డి వెంకట్రామమ్మ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ఆశ వర్కరర్లకు యిచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని అధికార పార్టీ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆశా ఉద్యోగస్తులను అరెస్టు చేయడం ఆప్రజాస్వామిక చర్య అని చిన్నంబావి మండల మాజీ యoపిపి సోమేశ్వరమ్మ, మాజీ జడ్పిటిసి కేసిరెడ్డి వెంకట్రామమ్మ ఆరోపించారు. కనీసం తమ సమస్యల గూర్చి చెప్పకునే హక్కు కూడ లేదా కడుపు మండి చాలి చాలని జీతం తమకు యిచ్చిన మాట నెరవేర్చాలని తెలంగాణ రాష్ట మెడికల్ ఆప్పీస్ హైద్రాబాద్ యందు శాంతి యుతముగా ధర్నా కార్యక్రమానికి బయలు దేరిన ఆశ ఉద్యోగస్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం పోలీస్ స్టేషన్ ముందు ఫోటోలు దింపి నేరస్థులుగా పరిగనిoచ్చేవిధముగా అవమానిచడం ఎంతవరకు సమంజసమoటూ ఇదేనా అధికార పార్టీ కొత్త మార్పు అంటూ మాజీ ఎంపిపి మాజీ జడ్పిటీసి మండి పడ్డారు

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State