గ్రామపంచాయతీ కార్యాలయం లో నిర్వహించిన సభలో మాట్లాడుతున్నసర్పంచ్
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ రోజు ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం లో నిర్వహించిన సభలో మాట్లాడుతున్నసర్పంచ్ కళ్లెపెల్లి చంద్రమోహన్ రైతులకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇవ్వడం అర్హులు అయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు సకాలంలో బిల్లులు ఇవ్వడం కల్యాణ లక్ష్మి పథకం అందించడం మా ప్రభుత్వద్యేయం సర్పంచ్ గా ఎన్నిక అయినప్పటి నుండి ఈనాటి వరకు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న బజారుల్లోవీధిలైట్లు ఏర్పాటు చేయడం మల్లికార్జున స్వామి దేవాలయం వరకు గుంతలు లేకుండా రోడ్డు వేయడం అలాగే 10లక్షల రూపాయలతో CC రోడ్డు బోడబండ వరకు మరో 10లక్షల రూపాయలతో గుడివరకు రోడ్డు వేయించడం జరుగుతుంది అలాగే వానాకాలం వర్షంవల్ల బజార్ నుండి వరద పొలాల్లో చేరడం వలన పొలాలు దెబ్బతినతున్నాయి అందువలన డైరెక్ట్ గా ఏటిలోకి నీరు పోయేలా పైప్ లైన్ వేయడం పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిల్వ లేకుండా కృషి చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని గ్రామసభలో చెప్పడం జరిగింది గ్రామ ప్రజలు నామీద నమ్మకంతో గెలిపించినందుకు యువకునికి మీలో ఒకడిగా ప్రతి హామీ నెరవేరుస్తానని చెప్పడం జరిగింది అలాగే పాడైపోయిన CC కెమెరాలు బాగుచేయించి దొంగల బెడలేకుండా చేస్తానని చెప్పడం జరిగింది.ఇసుక మాఫియాను అరికట్టేందుకు కృషి చేస్తానని సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు నిర్ణయించారు