గోడ పత్రిక ఆవిష్కణ:-జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్

Oct 28, 2024 - 17:44
Oct 28, 2024 - 18:13
 0  6
గోడ పత్రిక ఆవిష్కణ:-జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్

జోగులాంబ గద్వాల 28 అక్టోబర్ 2024  వార్త ప్రతినిధి:- గద్వాల 21వ అఖిల భారత పశుగణన గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్. సోమవారం ఐ.డి. ఓ.సి  సమావేశం హాల్ నందు పశు సంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన పశుగణన కార్యక్రమ గోడప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 21వ అఖిలభారత పశుగణన-తెలంగాణ సర్వే కార్యక్రమం జిల్లాలో ఈ నెల 25 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు కొనసాగుతుందని అన్నారు.ఈ ప్రక్రియలో ఆవులు, గేదెలు, గొర్రెలు,కోళ్ళు, మేకలు,ఇతర జంతువుల సమాచారాన్ని డిజిటల్ పద్దతిలో మొబైల్ అనువర్తనం ద్వారా నిక్షిప్తంగా చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 12 మండలాలకి గాను ఒక నోడల్ ఆఫీసర్,12 మంది సూపర్వైసర్లు, 44 మంది ఎన్యుమేరేటర్లు కలిసి జిల్లాలోని ప్రతి నివాస గృహాన్ని సందర్శించి పశుఘనణ వివరాలు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఇట్టి వివరాల సేకరణలో ప్రజా ప్రతినిధులు, పాడి రైతులు, పశు పోషకులు, గొర్లకాపర్లు ప్రతి ఒక్కరు సహకరించి కచితమైన సమాచారాన్ని అందించాలన్నారు.  పశు గణన వివరాల ద్వారా మాంసం గుడ్డు, పాల ఉత్పతులు గుణించి పశు సమవర్ధక రంగాబివ్రుద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు చేసుకోడానికి తోడ్పడుతుందని అన్నారు. తద్వారా భారత దేశ స్తూల జాతీయ ఉత్పత్తి  పెంచడానికి దోహదపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్ డి ఓ రామచందర్, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మత్స శాఖ అధికారి షకీలా భాను, ఆర్డబ్ల్యూఎస్ ఏ. ఈ శ్రీధర్ రెడ్డి, వైద్యులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333