కొక్కిరేణిలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నా..

Apr 8, 2024 - 18:49
Apr 8, 2024 - 19:06
 0  4
కొక్కిరేణిలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నా..

మునగాల 08 ఏప్రిల్ 2023 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మునగాల మండలంలోని కొక్కిరేణి గ్రామంలో గత రెండు రెండు నెలలుగా మంచి నీరు లేక గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్న కనీసం అధికారులు పట్టించుకోవడంలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీపీ ములకలపల్లి రాములు విమర్శించారు సోమవారం గ్రామ ప్రజలు కాళీ బిందెలతో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేయటం జరిగింది అనంతరం రాములు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా దున్నపోతు మీద వాన కురిసినట్లు గా వివరిస్తున్నారని ఆయన విమర్శించారు గత రెండు మాసాలుగా మంచినీరు లేక ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యారని వారు అన్నారు వేసవి కావటంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్ల నీరు ఇంకిపోయి. మిషన్ భగీరథ పైపులు ఉన్నప్పటికీ అట్టి నీరు రాక బోర్లు ఎండిపోయి గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన మంచినీటి కోసం నిధులు కేటాయించి కొక్కిరేణి గ్రామ ప్రజల దహతిని తీర్చాలని వారు డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు గ్రామ మాజీ ఉపసర్పంచ్ రావులపెంట బ్రహ్మం సింగిల్ విండో డైరెక్టర్ నిడిగొండ శంబయ్య దేవర నరసయ్య నందిగామ చిన్న రాములు ఇంటూరు హుస్సేన్ రెడ్డి బోయిన శ్రీకాంత్ గడ్డం చిన్న అంజయ్య ఎర్రమళ్ళ సురేష్ కామల్ల ప్రవీణ్ రావులపెంట నారాయణ మామిడి గురుమూర్తి మహిళలు వట్టెపు సుజాత. మామిడి ధనలక్ష్మి ఇంటూరి కనకమ్మ కత్తి ఉమా ములకలపల్లి ఝాన్సీ నందిగామ సుశీల తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State