గుర్తు తెలియని వ్యక్తి మృతి.
జోగులాంబ గద్వాల 31 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. ఈ రోజు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో గద్వాల రైల్వే స్టేషన్ లోని ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై నేపాల్ దేశానికి చెందిన రాజు రామ్ దగౌరా వయసు 40 సంవత్సరాలు అనే వ్యక్తి బెంచ్ పక్కన పడుకున్న చోటనే మృతి చెందినాడు. అతను గుండెపోటు కారణంగానే మృతి చెంది ఉండవచ్చును అతని వద్ద ఉన్న చీటీ లో వ్రాసిన సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులను విచారించగా అతను తేది 23-3-2024 నాడు నేపాల్ నుండి జీవనోపాధి గురించి బెంగళూరు కు వచ్చినట్టుగా తెలిసినది. మృతునికి భార్య రత్న ఇద్దరు కుమారులు కలరు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వచ్చేంతవరకు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరచడమైనది. G. రామకృష్ణ రైల్వే హెడ్ కానిస్టేబుల్ గద్వాల్ తెలిపారు.