కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండ సుంకరి జనార్ధన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

Sep 10, 2026 - 22:04
 0  4
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండ సుంకరి జనార్ధన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

తిరుమలగిరి 11 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఉచిత సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  సారథ్యంలో, రాష్ట్ర పౌరసరఫరాలు మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆధ్వర్యంలో, తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత,  శాసనసభ్యులు మందుల సామేల్  సూచనల మేరకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమం లో 5వ వార్డు కౌన్సిలర్ తిరుమణి యాదగిరి ఏదో వార్డ్ కౌన్సిలర్  బత్తుల శ్రీనివాస్  వర్కింగ్ ప్రెసిడెంట్ జిమ్మిలాల్  మాజీ కౌన్సిలర్ భాస్కర్ నాయక్ జట్టి వెంకన్న  కొంగరి సోమయ్య హీరో నాయక్  రవ్వ లడ్డు  కుంభం సతీష్ గౌడ్  సర్పంచ్ బుచ్చి నాయక్ తదితరులు పాల్గొన్నారు... 

 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి