బుల్లెట్ ట్రైన్ సాధనే లక్ష్యంగా ఉద్యమిద్దాం
బుల్లెట్ ట్రైన్ సాధన దీక్షలో గళం విప్పినలో ఆర్యవైశ్యులు...
సంఘీభావం తెలిపిన ప్రముఖ పారిశ్రామికవేత్త మీల మహాదేవ్ మంచాల రంగయ్య...
సూర్యాపేట.....
ప్రపంచ పటంలో సూర్యాపేటలో గుర్తుపట్టాలంటే కేంద్రం మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా వెళ్లే వరకు అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్ రైలు ఉద్యమ నేత మంచాల రంగయ్య పిలుపునిచ్చారు. బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 26 రోజు మంగళవారం రిలే నిరాహార దీక్షలు పట్టణ ఆర్యవైశ్యులు పాల్గొనగా వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. రెండు రాష్ట్రాల రాజధానులకు మధ్యలో ఉన్న సూర్యాపేట అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పటికీ రైలు సౌకర్యం లేక అభివృద్ధి బయట ప్రపంచానికి చూపించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మన పురోగతిని గమనించి ఏకంగా బుల్లెట్ ట్రైన్ మంజూరు చేసింది దానిని పక్కదోవ పట్టిస్తున్న వారికి వ్యతిరేకంగా ఉద్యమించి మనకు మంజూరైన బుల్లెట్ ట్రైన్ మనకే దక్కేలా తీవ్రస్థాయిలో ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. బుల్లెట్ ట్రైన్ జాతీయ రహదారి 65 వెంట సూర్యాపేట మీదుగా వచ్చినప్పుడు ప్రపంచ పటంలో సూర్యాపేటకు మంచి గుర్తింపు వస్తుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష కూర్చున్న వారికి పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. దీక్షకు కూర్చుని వారిలో ఆర్యవైశ్య సంఘం నాయకులు
తోట శ్యాం, బిక్కుమల్ల కృష్ణ ,బెలిదే శ్రీనివాసులు , మంచాల రంగయ్య, ఆర్ శ్రీనివాస్, మహేశ్, లావణ్య పద్మజ, శ్రీదేవి, సంతోషి, నాగరాజు, మోహన్ రావు, సురేష్, నర్సింహ రావు ,ప్రవీణ్, ఎర్కషేర్ల శోభ,శంకర్, రమేశ్, వీరభద్రం వెంకటేశ్, శ్రావణకుమార్, వెంకన్న లు పాల్గొనగా వారికి సంఘీభావంగా మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా,కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అనుమలపురి రవి, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, పెద్దిరెడ్డి గణేష్,
సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వెంబడి మధు,హుజూర్నగర్,కోదాడ, తిరుమలగిరీ పోలిశెట్టి నరసింహారావు,ఓరుగంటి బ్రహ్మం, తాడిశెట్టి రమేష్, గండూరి ప్రకాష్, డాక్టర్ రామ్మూర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ,న్యాయవాది నరసయ్య యాదవ్, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.