గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం

Apr 8, 2025 - 19:46
 0  2
గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం
గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం

జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి . మహిళా శిశు  సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో  ఎర్రవల్లి  గ్రామం, ఎర్రవల్లి మండలం,లో గ్రామస్థాయి బాలాల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి చైల్డ్ ప్రాజెక్టు డెవలప్మెంట్ ఆఫీసర్ సుజాత CDPO , మాట్లాడుతూ పిల్లల కోసం రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైన హక్కులు కలిగి ఉన్నారని తెలియజేయడం జరిగింది. బాలల హక్కులు మరియు బాలల చట్టాల గురించి  వాటి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం జరిగింది. బాలల హక్కులు అనగా 1.జీవించే హక్కు ,2.రక్షణ పొందే హక్కు , 3.అభివృద్ధి చెందే హక్కు, 4.భాగస్వామ్య హక్కు, గురించి హక్కుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా బాల చట్టాల పైన కూడా అవగాహన కల్పించడం జరిగింది. పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా బాలింతలకు ,గర్భిణీ స్త్రీలకు, కిశోర బాలికలకు పౌష్టికాహారాన్ని ,ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం ద్వారా వచ్చే లాభాలు ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం జరిగింది, మంచి ఆహారాన్ని తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని తెలియజేయడం  జరిగింది. మరియు అదే విధంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి జోగు రవి  మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమంలో బాలల హక్కులను కాపాడాలని మరియు పిల్లలు యొక్క హక్కులను వారు పొందే విధంగా చూడాలని కోరడం జరిగింది. పిల్లలు వారి  హక్కులను  స్వేచ్ఛగా అనుభవించే హక్కు ఉందని,  కాబట్టి వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేయడం జరిగింది.  బాలల కోసం కొన్ని చట్టాలు ఉన్నాయని కూడా తెలియజేయడం జరిగింది. బాల్య వివాహ నిరోధక చట్టం పైన కూడా అవగాహన కల్పించడం జరిగింది.  అమ్మాయికి కనీసం18  సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలి.  మరియు అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తిగా నింగి ఉండాలి,  బాల్యవివాహం ఎవరైనా చేసుకున్నట్లయితే చేసినట్లయితే ఈ చట్టం ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధిస్తామని  తెలియజేయడం జరిగింది. బాల్యవివాహాల నిర్మూలించడం కోసం ప్రభుత్వం అందించే  వంటి సంక్షేమ పథకాల గురించి తెలియజేయడం. మరియు బాల్య వివాహం చేసుకోవడం ద్వారా వచ్చే నష్టాలు సమస్యల గురించి అవగాహన కల్పించడం జరిగింది. బాల్య వివాహం చేసుకోవడం ద్వారా జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు, భవిష్యత్తులో వచ్చే సమస్యల గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరియు ప్రసవ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, పుట్టబోయే పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు  గురించి అవగాహన కల్పించడం జరిగింది. అందరూ మంచిగా శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా రాణించాలని కోరడం జరిగింది. మీ యొక్క తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తేవాలని మంచి క్రమశిక్షణతో మెడగాలని కోరడం జరిగింది. బాలలపై లైంగిక వేధింపుల చట్టం ప్రకారం అమ్మాయిలపై ఎవరైనా లైంగిక వేధింపులు పాల్పడినట్లయితే వారికి కనీసం ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష ఉంటుందని తెలియజేయడం జరిగింది., పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండి మాట్లాడాలని మరియు వారం చెప్పే మాయమాటలు విని మోసపోవద్దని తెలియజేయడం జరిగింది. మరియు కౌమార దశలో వచ్చే శారీరక ,మానసిక వికాసంలో వచ్చే మార్పుల గురించి అవగాహన కల్పించడం జరిగింది.  విద్యార్థులందరూ కూడా క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని కోరడం జరిగింది. బడి మానేసిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లైతే పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్పించాలని కోరడం జరిగింది. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఆ పని లో పెట్టుకున్నట్లైతే చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం విధించిన శిక్ష గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది.
పిల్లలందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరడం జరిగింది. మనం ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటామో అప్పుడే బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది.  ప్రభుత్వం అమ్మాయిల కోసం ప్రభుత్వం అందించే ఉచిత విద్య, వసతి వసతి సౌకర్యాల గురించి తెలియజేయడం జరిగింది. ఎవరైనా పిల్లలు హింసలకు వేధింపులకు అవుతున్నట్లయితే  వారి యొక్క సమస్యలును   1098,100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియ చేయాలని చెప్పడం జరిగింది. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 24/7 పిల్ల లెక్క రక్షణ కోసం పనిచేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. 1098 కి   కాల్ చేసినట్లయితే వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది.

    ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జయమ్మ,  గ్రామపంచాయతీ సెక్రెటరీ  రంగన్న,పాఠశాల ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, మహేశ్వరి, అంగన్వాడీ టీచర్లు, సుజాత ,సువర్ణ , గ్రామ పెద్దలు, మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333