గిరిజన బిడ్డకు దక్కిన గౌరవం

Mar 11, 2025 - 00:58
Mar 11, 2025 - 01:03
 0  4
గిరిజన బిడ్డకు దక్కిన గౌరవం

కేతావత్ శంకర్ నాయక్ కు  ఎమ్మెల్సీ:

మాజీ మంత్రి సీనియర్ నాయకులు కుందూరు జానా రెడ్డి కి ధన్యవాదములు

గజలాపురం కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు సింగం కార్తీక్

తెలంగాణ వార్త,మాడుగులపల్లి; మార్చి 10:- శంకర్ నాయక్ చేసిన సేవలను గుర్తించి కాంగ్రెస్ హైకమాండ్ ఎంఎల్ఏ కోట కింద ఎమ్మెల్సీ గా ఆదివారం ప్రకటించినందుకు కాంగ్రెస్ హైకమాండ్ కు మాజీ మంత్రి సీనియర్ నాయకులు కుందూరు జానా రెడ్డి కి ధన్యవాదములు తెలియజేసిన మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు సింగం కార్తిక్ .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన బిడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రీతీ పాత్రుడు పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు గా పార్టీ పటిష్టత కోసం పార్టీనే నమ్ముకొని సుదీర్ఘ కాలంగా ముందుండి పార్టీ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయా రాగ్యా నాయక్ తరువాత పార్టీ కోసం అంతగా పనిచేసిన నాయకుడు మన నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అని ఇప్పటికే జిల్లాకు రెండు పర్యాయాలు డిసిసి అధ్యక్షుడిగా పని చేసారని, నల్లగొండ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి జిల్లాలోనే అన్ని ఎమ్మెల్యే స్థానాలు భారీ మెజార్టీ తో గెలిపించడాని కి కష్టపడి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ధైర్యాన్ని ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో ముందుకు తీసుకువెళ్లిన కేతవత్ శంకర్ నాయక్ చేసిన సేవలను గుర్తించి కాంగ్రెస్ హైకమాండ్ ఎంఎల్ఏ కోట కింద ఎమ్మెల్సీ గా ఆదివారం ప్రకటించినందుకు కాంగ్రెస్ హైకమాండ్ కు మాజీ మంత్రి సీనియర్ నాయకులు కుందూరు జానా రెడ్డి కి ధన్యవాదములు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333