నాగోల్ సాయి నగర్‌లో మోడల్ రైతు చికెన్ బజార్ నూతన బ్రాంచ్ ప్రారంభం
నాగోల్ సాయి నగర్‌లో మోడల్ రైతు చికెన్ బజార్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రాంతీయ వినియోగదారులకు నాణ్యమైన, తక్కువ ధరలో తాజా చికెన్ ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో ఈ బ్రాంచ్‌ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామ్ కిషన్ రావు, నల్గొండ గద్దర్ నర్సన్న, స్థానిక కార్పొరేటర్,పౌండర్ వాసుదేవరావు, విజయేంద్ర రెడ్డి హాజరై, నిర్వాహకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. అనంతరం వారు దుకాణాన్ని పరిశీలించి, అందుబాటులో ఉంచిన సౌకర్యాలు, పరిశుభ్రత ప్రమాణాలను అభినందించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రజలకు శుభ్రతతో కూడిన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడం అత్యంత ముఖ్యమైన విషయం. నాగోల్ సాయి నగర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఇలాంటి వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం సంతోషకరం. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వినియోగదారులకు విశ్వసనీయ సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. మోడల్ రైతు చికెన్ బజార్ నిర్వహకులు మాట్లాడుతూ తాజా పరిశుభ్రమైన చికెన్ ఉత్పత్తులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాసెస్ చేసి వినియోగదారులకు అందిస్తామని తెలిపారు. కస్టమర్ల సంతృప్తే తమ లక్ష్యమని, నాణ్యతలో ఎలాంటి రాజీ పడబోమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మునగాల రాఘవేందరావు, మాదడి పురుషోత్తం రావు, వెంకట్ రెడ్డి, సుదీర్ తదితరులు పాల్గొన్నారు.