చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సయ్యద్ మహమ్మద్ భాష
చిన్నంబావి మండల కేంద్రంలో సయ్యద్ మహమ్మద్ పాషా ఏర్పాటు చేసిన చలివేంద్రం, ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
21-03-2024 తెలంగాణవార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:- కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెల్డింగ్ షాప్ యజమాని సయ్యద్ వారి కుటుంబ సభ్యులు హుస్సేన్ మియా, ముస్రత్ భాను గార్ల జ్ఞాపకార్థం తో చిన్నంబావి మండల కేంద్రంలో బస్ స్టాప్ దగ్గర చలివేంద్రంని ఏర్పాటు చేశారు.
ప్రతి రోజు నిత్యం వివిధ గ్రామాల ప్రజలు వారి అవసరాల కోసం చిన్నంబావి మండల కేంద్రానికి వస్తుంటారు ప్రజలు ప్రయాణికులు తాగునీటికి ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేసిన సయ్యద్ గారు మంచి నిర్ణయం తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలంలో ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేసి వివిధ గ్రామాల ప్రజలమన్ననలు పొందుతున్న సయ్యద్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రయాణికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సయ్యద్ మహమ్మద్ భాష కు అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా మహిళా అధ్యక్షురాలు అగ్గన్నగారి శ్రీలత ప్రతాప్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు జంగ బిచుపల్లి యాదవ్, పసుపుల రంజిత్ కుమార్చి,న్నంబావి మండలం కిసాన్ సెల్ అధ్యక్షుడు నంది పుల్లారెడ్డి, వడ్డెమాన్ బిచ్చన్న, తెలుగు మధు, మరియు ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.