కత్తి జానకిని సన్మానించిన బిజెపి రాష్ట్ర నాయకుడు ధారాసింగ్

01-11-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:- చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన కొప్పునూరు గ్రామంలో ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కత్తి జానికికి సన్మానం.
సన్మానించిన BJP రాష్ట్ర నాయకుడు ధార సింగ్ గారు.
BJP మండల అధ్యక్షుడు జెగ్గారి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొప్పునూరు గ్రామంలోని మొట్టమొదటిగా క్రియాశీలక సభ్యునిగా ఎన్నికైన ఎస్సీ మోర్చా మండలాధ్యక్షుడు కత్తి జానీకి గారిని నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు కొల్లాపూర్ ఇంచార్జ్ శ్రీ ఏల్లేని సుధాకర్ రావు గారి ఆదేశానుసారంగా బిజెపి రాష్ట్ర నాయకుడు ధార సింగ్ సన్మానించడం జరిగింది. అదేవిధంగా చిన్నంబావి మండలంలోని 100 సభ్యత్వాలు పూర్తిచేసుకుని క్రియాశీలక సభ్యునిగా ఎన్నికైన ప్రతి బిజెపి పార్టీ కార్యకర్తను ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మండల ఇన్చార్జ్ మల్లికార్జున, మండల నాయకులు గోపి నాయుడు, యూత్ నాయకుడు శశిధర్, తదితర నాయకులు పాల్గొన్నారు.