మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ
తిరుమలగిరి 30 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్,జిల్లా కో-ఆర్డినేటర్ మేకల సతీష్ రెడ్డి ఆదేశానుసారం, అలాగే జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు సూచన మేరకు, తుంగతుర్తి నియోజకవర్గం ముఖ్య నాయకులు దుబ్బాక అశోక్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో చంటి పాపతో వచ్చి తిరుమలగిరి మున్సిపాలిటీలో 13వ వార్డుకు నామినేషన్ వేసిన గంట వనజ లక్ష్మణ్ మరియు ఐదో వార్డులో నామినేషన్ వేసిన గిలకత్తుల వెంకన్న గౌడ్ వీరు ఇరువురిని ఆశీర్వదించి గెలిపించండి వీరు ముందు ముందు రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తారు భవిష్యత్తులో యువతకు మంచి భవిష్యత్తునిద్దామని ఆలోచిస్తున్న జనసేన పార్టీని ఆశీర్వదించాలని అన్నారు....