గట్టికల్ లో ఘనంగా సంక్రాంతి క్రీడలు ప్రారంభించిన ఎస్సై శ్రీకాంత్ గౌడ్
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- గట్టికల్ లో ఘనంగా సంక్రాంతి క్రీడలు ప్రారంభo ఆత్మకూరు ఎస్.. క్రీడలు గ్రామాల్లోని ప్రజల మధ్య ఐకమత్యాన్ని స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఆత్మకూరు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని గట్టిగల్లు గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం క్రీడలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి యువకుల్లో ఏదో ఒక క్రీడా నైపుణ్యత కలిగి ఉంటుందని పండుగల సందర్భంగా గ్రామాల్లో నిర్వహించే ఇలాంటి క్రీడలతో వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయవచ్చని ఆయన అన్నారు. పండుగల సందర్భంగా గ్రామాల్లో ఇల్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసుల సమాచారం ఇచ్చి దొంగతనాలతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గ్రామంలో కీర్తిశేషులు సామ వీరారెడ్డి గాదే రోశయ్య, భూపతి భక్కయ్య ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారం తో నిర్వహించేoదుకు ముందుకొచ్చిన వారిని అభినందించారు. తుమ్మల పెంపహాడ్ లో క్రీడలు ప్రారంభం మండల పరిధిలోని తుమ్మల పెన్ పాడు గ్రామంలో జై భీమ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సంక్రాంతి క్రీడలను ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో జై భీమ్ సోషల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గోనె మురళి,కోశాధికారి కుమ్మరి కరుణాకర్, జెన్కో ఏ డీ ఇ చెవుల వీరభద్రయ్య గోనె సాగర్,చెవుల ఎల్లయ్య,గోనె శ్రీకాంత్,బొండల విక్రమ్,చెవుల జానీ, బొందల అనిల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.