కర్నూలు: రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం..

May 25, 2024 - 20:59
 0  7
కర్నూలు: రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం..

కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు.. పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు ఓ వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారులు వేలంపాట నిర్వహించగా  భారీ ధరకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు. కర్నూలు జిల్లా ఒక్కటే మాత్రమే కాదు అటు అనంతపురం జిల్లాలోని పొలాలు, స్థలాల్లో కూడా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది.కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. గత వారం రోజులుగా జనాలు పొలాల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు.. ఈ క్రమంలో ఓ రైతును అదృష్టం వరించింది. పొలంలో పనులు చేస్తుండగా ఓ వజ్రం దొరికింది.. జీవితమే మారిపోయింది. కర్నూలు జిల్లా మద్దెకర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేసుకుంటున్నాడు. అతడికి పొలంలో ఓ వజ్రం దొరకగా.. పెరవలికి చెందిన వ్యాపారి వేలం పాటలో రూ.5 లక్షలు, రెండు గ్రాముల బంగారం రైతుకు ఇచ్చి ఆ వజ్రాన్ని దక్కించుకున్నాడు. అయితే బయట మార్కెట్‌లో ఆ వజ్రం విలువ ఇంకా ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333