యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Sep 8, 2025 - 14:36
Sep 8, 2025 - 19:18
 0  6
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

మునగాల 08 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :-  మత్తు పదార్థాలు వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని.ఈ ప్రమాదం బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని. మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు.సోమవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..కేవలం క్షణికానందం కోసం మత్తు పదార్థాలు చవించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడం ఒక కలగానే మిగిలిపోతుంది అన్నారు. ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఉన్నత చదువులు చదివించి మీ బంగారు భవిష్యత్తుకై ఎదురుచూసే తల్లిదండ్రులకు తమ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలు మారడంతో తల్లిదండ్రు ఇలాంటి వేదనకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించండి మత్తు పదార్థాల వినియోగం ద్వారా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని యువత గ్రహించాలని అన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత శారీరికంగాను మానసికంగాను తీవ్రంగా బలహీన పడిపోతారని భవిష్యత్తు నాశనం అవుతుందని అటువంటి దురలవాట్లకు దూరముగా ఉండాలని హితువు పలికారు .ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన, సేవించిన సమాచారం అందించడం ద్వారా వారిపై తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State