కులగణన చేసి బీసీ రిజర్వేషన్లను పెంచాలి
తిరుమలగిరి 13 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ప్రస్తుతం రాష్ట్రంలో కులగనణ జరిపి,గ్రామపంచాయతీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతే గ్రామపంచాయతీ ఎన్నికలు జరిపే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ బుధవారం తిరుమలగిరి క్యాంపు కార్యాలయంలో వినతి అందజేశారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు,మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జనాభా లెక్కల్లో కులగణనతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42 శాతం పెంచుతామని ఎన్నికల హామీ ఇచ్చారన్నారు.
ఆ హామీ ప్రకారం బీసీ సంక్షేమ సంఘం,బీసీలోని అన్ని కులాలు,ఐక్యంగా సంఘటితమై మద్దతుగా నిలబడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించారని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి వంగరి బ్రహ్మం,సుంకరి కిరణ్ కుమార్,మేరు సంఘం మండల అధ్యక్షుడు గూడూరు వెంకన్న,ముద్దంగుల యాదగిరి,మూల మహేష్ గౌడ్,వంగరి సోమకృష్ణ,తాళ్లపల్లి లింగయ్య,గూడూరు మధు,రామగిరి ఉపేందర్,రామగిరి మహేందర్,తరుణ్, తదితరులు పాల్గొన్నారు.