అక్రమంగా మట్టి తరలింపు దందా జోరు.
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి.జోరుగా అక్రమ మట్టి తరలింపు. ఆత్మకూర్ ఎస్.... మండల పరిధిలో నీ ముక్కుడు దేవులపల్లి గ్రామంలో పిల్లబోయినకుంటలో యదేచ్ఛగా మట్టి తరలింపు కొనసాగుతుంది. జెసిబి ట్రాక్టర్లతో మట్టిని తవ్వి ఇటుక బట్టీలకు,ఇతరులకు అమ్ముకుంటున్నారనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గత పది రోజుల్లో చెరువులోని మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులకు సమాచారం ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. శుక్రవారం చెరువులో సుమారు పది ట్రాక్టర్లు జెసిబి తో మట్టి తరలిస్తుండగా స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో మట్టి తరలింపు వారికి అధికారులు సమాచారం ఇచ్చినట్లు దాంతో అధికారులు వచ్చే లోగా ట్రాక్టర్ లు jcb అక్కడి నుండీ మాయమయ్యాయి. ఈ తంతు గత 10రోజులు గా కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ముక్కుడు దేవుల పల్లి స్టేజీ వద్ద ఉన్న ఇటుక బట్టి వద్ద చెరువు మట్టి భారీగా ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు మట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.