కుల గణన చేస్తే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బిసీలు 

Jul 20, 2024 - 19:55
Jul 20, 2024 - 19:56
 0  2
కుల గణన చేస్తే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బిసీలు 

- బీసీ కుల గణన సాధన యాత్ర ముగింపు మహాసభలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్

దేశంలో బీసీ కుల గణన జరిగితే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు వస్తారని అందుకే ప్రభుత్వాలు బీసీ కుల గణన చేయడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 14న చేపట్టిన బీసీ కుల గణన సాధన యాత్ర ముగింపు సభను శనివారం జిల్లా కేంద్రంలోని త్రివేణి పంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో కుక్కలకు నక్కలకు లెక్కలున్నాయి కానీ జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు లెక్కలు లేవన్నారు.

  బీసీలకు జనాభా ప్రాతిపదికన మన వాటా రిజర్వేషన్లు మనకు దక్కాలంటే బీసీలంతా ఐక్యంగా ఒకటవ్వాలని పిలుపునిచ్చారు. దేశంలో కుల గణన చేపడితే 60శాతం పైగా ఉన్న బీసీలే ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు బీసీల లెక్కలు తేలిస్తే జనాభా దమాషా ప్రకారం మనకు రావాల్సిన 50శాతం.రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని బీసీల లెక్కలు తీయకుండా తొక్కి పడుతున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ గణన చేస్తామని ప్రకటించిన బీజేపీ అధికారంలోకి రాగానే మాట' మార్చి బిసి కులాల లెక్కలు తీస్తే దేశ సమగ్రత దెబ్బ తింటుంది కొత్త రాగం అందుకుందన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీసీ ప్రధాని బిసి కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా అగ్ర వర్ణాలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత నరేంద్రమోదీకే దక్కుతుందన్నారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి బీసీలకు సామాజిక న్యాయం జరగేలా | చూడాలని లేదంటూ బిజేపి బీసీ వ్యతిరేక పార్టీగా నాటి మండల్ కమీషన్ నుంచి నేటి మోదీ ప్రభుత్వం వరకు చరిత్రలో మిగిలిపోతుందన్నారు. మన లెక్కలు తీయాలంటే మనం ఒక్కటి కావాలని మన వాట మనకు ఒక హక్కుగా దక్కాలంటే జెండాలను, పార్టీలను పక్కన పెట్టి పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల్ల నర్సింహ్మ, జిల్లా గౌరవ అధ్యక్షుడు బైరు వెంకన్న గౌడ్,విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర మల్సూర్గాగౌడ్, విక్రమ్, శ్యాం, గణేష్చారి, బాలరాజు, తన్నీరు రాంప్రభు. ఉప్పల మదు. జానయ్య. శేఖర్. విజయకృష, డేవిడ్గా గౌడ్. నాగమణి, చనగాని అంజమ్మ. నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333