ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద అప్లికేషన్స్ వెరిఫికేషన్ చేసి రుణాలు అందించాలి.*
*ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద అప్లికేషన్స్ వెరిఫికేషన్ చేసి రుణాలు అందించాలి.*
*జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి.*
*జోగులాంబ గద్వాల 11 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.*
*గద్వాల.*
*ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద అప్లికేషన్స్ వెరిఫికేషన్ చేసి బ్యాంకు రుణాలను అందించాలని కలెక్టర్ కి B.M. సంతోష్ కి వినతిపత్రం అందించిన బిజెపి జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి.*
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా జిల్లాలో వెరిఫికేషన్ అయినటువంటి లబ్ధిదారులకు శిక్షణ ద్వారా రుణం సౌకర్యం గురించి అందేవిధంగా గ్రామ పంచాయతీల పరిధిలోగల లబ్ధిదారుల అప్లికేషన్ లను పంచాయతీ సెక్రటరీల ద్వారా పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద 18 వృతులకు సంబంధించి జిల్లాలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నారు. అని జిల్లాలోని పురపాలక సంఘం ద్వారా అప్లై చేసుకున్న లబ్ధిదారుల అప్లికేషన్స్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. కానీ గ్రామపంచాయతీలో పరిధిలోగల లబ్ధిదారుల అప్లికేషన్ ఇంతవరకు వెరిఫికేషన్ చేయలేదు. కావున పంచాయతీ సెక్రటరీల ద్వారా వీరి అప్లికేషన్స్ వెరిఫికేషన్ ప్రక్రియ వెంటనే జరిపించగలరని మరియు జిల్లాలో వెరిఫికేషన్ అయినటువంటి లబ్ధిదారులకు శిక్షణ ఇప్పించి తదనంతరం వారి వారి వృత్తుల ఆధారంగా శిక్షణ పొందిన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణం పొందడానికి అనుమతి ఇవ్వగలరని కలెక్టర్ వినతి పత్రం ద్వారా కోరడం జరిగిందన్నారు.
ఇట్టి కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎగ్బోటి,ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షుడు దాసు తదితరులు ఉన్నారు.