కామ్రేడ్ గడ్డం అమృత రెడ్డికి విప్లవ జోహార్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలెబోయిన కిరణ్

నాగారం 22 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని డి కొత్తపల్లి గ్రామంలో పిడిత ప్రజల ప్రియతమ నాయకుడు కామ్రేడ్ గడ్డం అమృత రెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా తన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.పిడి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్ మాట్లాడుతూ..కామ్రేడ్ గడ్డం అమృత రెడ్డి వ్యవస్థ మార్పు కోసం, పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ గుండాలు అతి కిరాతకంగా హత్య చేశారని దుయ్యబట్టారు. వ్యక్తులను నాశనం చేయడం ద్వారా పార్టీ లేకుండా పోతుందని కలలుగన్న కాంగ్రెస్ నాయకుల ఆలోచనలు హేయమైనదని అన్నారు.
జీతగాళ్ళ సమస్య,సారా వ్యతిరేక ఉద్యమంలో,గ్రామంలో పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించారని కొనియాడారు.పేదల పక్షాన కొట్లాడిన అమరవీరులు ప్రజల గుండెల్లో నిరంతరం చిరస్మరణీయుడిగా ఉంటారని అన్నారు. కామ్రేడ్ గడ్డం అమృత రెడ్డి ఆశయాల సాధన కోసం, నేడు పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసి గ్రామ మాజీ సర్పంచ్ యానాల సుధాకర్ రెడ్డి, పెరమళ్ళ సత్తయ్య, కళింగ రెడ్డి, యెషబోయిన లింగయ్య, యస్ డి సమాద్, సంపేట రాకేష్, సురేష్, రమేష్, లింగాల సైదులు తదితరులు పాల్గొన్నారు.