ప్రాపర్టీ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు 

Nov 14, 2024 - 15:54
 0  5
ప్రాపర్టీ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు 
ప్రాపర్టీ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు 

జోగులాంబ గద్వాల 14 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల ప్రాపర్టీ నేరాల పై పూర్తి దృష్టి సాధించి అట్టి కేసులలో సరైన సాక్ష్యాధారాలను సేకరించి సాంకేతికతను ఉపయోగించి త్వరగా కేసులను చేదించాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు పోలీస్ అధికారులను ఆదేశించారు. గద్వాల్ పట్టణం తో పాటు, జిల్లాలో  ప్రాపర్టీ నేరాలు జరుగాకుండా వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల పై ఈ రోజు జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో వారి ఛాంబర్ లో సమావేశ అయి ప్రాపర్టీ నేరాల పై సమీక్షించారు.ప్రాపర్టీ  నేరాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని , నేరాలు జరిగిన వెంటనే తగిన సాక్ష్యాధారాలను సేకరించి సాంకేతిక పరిజ్ఞానo తో  కేసులను త్వరగా చేదించాలనీ సూచించారు. ప్రాపర్టీ నేరాలలో జైలు నుండి విడుదల అయిన వారి పై, రిపిట్ ప్రాపర్టీ నేరస్థుల పై, గతంలో ప్రాపర్టీ నేరాలలో పాల్గొన్న వారి పై ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు.  ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో తరుచూ ప్రాపర్టీ నేరాలు జరిగే ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ పెట్రోలింగ్ తో పాటు రాత్రి సమయంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఆయా ప్రాంతాలలో ప్రజలతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీ పోలీసింగ్ లో బాగంగా సీసీ కెమెరాలు లేని చోట సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఆయా ప్రాంతాలలో  విజిబుల్ పోలీసింగ్ ను మరింత పెంచాలని, సర్ప్రైస్ వాహన తనిఖీలు నిర్వహించాలని సూచించారు.నేను సైతం కార్యక్రమం లో బాగంగా ఆయా షాప్స్  లలో, వ్యాపార సముదాయాలలో  సీసీ కెమేరాలు ఏర్పాటు  చేసుకునేటట్లు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ముఖ్యంగా గద్వాల్ పట్టణం లో ప్రాపర్టీ నేరాలు జరుగాకుండ పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.అందులో భాగంగా
1. రైల్వే స్టేషన్ చుట్టు ప్రాంతాలలో పెట్రోలింగ్, గస్తీ ను పెంచడం తో పాటు సిబ్బంది తో ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు  నిఘా ఉంచాలని అన్నారు.
2. 2. కమ్యూనిటీ పోలీసింగ్ లో బాగంగా పట్టణము లోని కాలనీ వాసులతో సీసీ కెమెరాల ప్రాధాన్యత , ఉపయోగం గురించి అవగాహాన కార్యక్రమాలు నిర్వహించి కొత్తగా CC కెమేరాలు ఏర్పాటు చేసుకునే టట్లు ప్రోత్సహించాలనీ ఆదేశించారు.

3. గద్వాల్ సర్కిల్ పరిధిలోనీ సిబ్బంది తో ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసి రాత్రి సమయాలలో తిరిగే బీట్స్ ను మరిన్ని పెంచాలని సూచించారు.
4. పట్టణం లో వ్యాపార సముదాయాలను రాత్రి 10:30 గంటలకు క్లోజ్ చేపించి  రాత్రి 11:00 గంటల నుండి పట్టణం లో తిరిగే వారిని వివరాలు అడిగి తెలుసుకొని పంపడం మరియు  రాత్రి సమయంలో అనుమానాస్పదంగా కనిపించే వారిని పాపీలాన్ డివైజ్ ద్వారా ప్రింగర్ ఫ్రింట్స్ తిసుకొని పరిశీలించడం చెయ్యాలని అన్నారు.

5. గతంతో గద్వాల్ పట్టణంలో పని చేయని 103 సీసీ కెమేరాలను  పునరుద్ధరించడం జరిగింది. వీటికి అదనంగా ఎక్కువగా ప్రాపర్టీ కేసులు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ పని చెయ్యని సీసీ కెమెరాలను పునరుద్ధరించాలని సూచించారు.
6. ఇంటి భద్రతా గురించి కాలనీలలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టి సెంటర్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం గురించి, ఇల్లును విడిచి వేరే ఊర్లకు వెళ్ళేటప్పుడు పక్క ఇంటి వారిని కనిపెడుతూ ఉండమని చెప్పటం లేదా పోలీస్ వారికి సమచారం ఇవ్వడం గురించి, ఆ సమయంలో విలువైన వస్తువులను ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్స్ లలో పెట్టుకోవడం గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డి.ఎస్పి సత్యనారాయణ గారు, గద్వాల్,ఆలంపూర్ సీఐ లు శ్రీనివాస్, రవి బాబు, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, గద్వాల్ టౌన్,రూరల్ ఎస్సైలు కల్యాణ్ కుమార్, శ్రీకాంత్, సీసీఎస్ ,డీసీఆర్బి ఎస్సై లు విజయ్ కుమార్, రజిత పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333