బైక్ బోల్తా ముగ్గురికి తీవ్ర గాయాలు

చర్ల మండలంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి దీనికి కారణం అతివేగము అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని తెలుస్తుంది. బుధవారం చర్ల మండలం తేగడ మూల మలుపు వద్ద పల్సర్ బైక్ నడుపుతున్న ముగ్గురు యువకులు అతివేగంతో వెళ్ళటం వల్ల అదుపుతప్పి పొదల్లోకి దూసుకు వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గాయాలైన ముగ్గురుని వైద్య చికిత్స నిమిత్తం సత్యనారాయణపురం ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో డాక్టర్ నగేష్ వైద్య పరీక్షలు నిర్వహించి వారికి సరైన మందులు ఇవ్వడం జరిగింది. గాయపడిన ఈ ముగ్గురు యువకులు చిన్న మిషిలేరు గ్రామానికి చెందిన వారుగా తెలుస్తున్నది. ఏది ఏమైనప్పటికీ రోజు చర్ల మండలంలో ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాఇ.అటు వాహనదారులు వాహనానికి ఎదురుగా వచ్చేవారు కూడా ఇబ్బందుల కు గురవటం జరుగుతోంది. అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎవరికి ఏ ఇబ్బంది కలగదని మండల వాసుల అభిప్రాయపడుతున్నారు.