కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలను ఆదుకోవాలి! ఓ సామాన్యు కార్యకర్త గాధ..
శాలిగౌరారం 15 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలానికి చెందిన కుమ్మం అశోక్ గౌడ్ శాలిగౌరారం 86వ బూత్ కన్వీనర్ తెలంగాణ వార్త పత్రిక ద్వారా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేల్ కు నమస్కారాలు మా చిన్న విన్నపము మీకు తెలియపరుస్తున్నాను.. జరగబోవు భువనగిరి పార్లమెంట్ ఎన్నికలలో అధిక మెజార్టీ కోసం 10 సంవత్సరాల నుండి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలం..మమ్ములను దిగిపోయిన బిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పార్టీని ఇబ్బంది పెట్టి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి,దాడులు చేయించిన,ప్రభుత్వం నుండి ఏ పనులు అయినా పథకాలు అయినా వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు రాకుండా చేశారు.బిఆర్ఎస్ ఆనాటి ప్రభుత్వం బిఆర్ఎస్ కార్యకర్తలకె ఇచ్చారు.టిఆర్ఎస్ వాళ్లు ఎవ్వరికీ ఇవ్వకుండ దౌర్జన్యాలకి పాల్పడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరుతున్నారు.కావున ఎమ్మెల్యే ఏ గ్రామానికి ఆ అధ్యక్షులు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసుకున్న తరువాత వారికి మీరు కండువా కప్పితే బాగుంటుంది.అని నా విన్నపం. లేకపోతే మళ్ళీ మా బ్రతకులు వాళ్ల చేతిలో పెట్టినట్లు అవుతుంది.. గ్రామాలలో స్థానికంగా సైలెంట్ గా కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశముంది.. కావున దయచేసి మీ మెజార్టీ ఓట్ల కోసం.. మమ్ములను నట్టేట్ల ఉంచుతుందని గ్రామ కార్యకర్తలుగా మేం కోరుకుంటున్నాం.. గత పది సంవత్సరాల నుండి ఊరికి పదిమంది లేకున్నా.. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాం! కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టాం..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏ పథకమైనా ప్రతి గ్రామ కార్యకర్తలకు ముందుగా ఇచ్చిన తర్వాతే ఇప్పుడు చేరే కార్యకర్తలకు ఇవ్వాలని కోరుతున్నాం! మేము పార్టీని నమ్ముకున్న కార్యకర్తలం మా బ్రతుకులు నాశనం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులను మేము నమ్ముతున్నాం.. శాలిగౌరారం మండల 86వ బూత్ కన్వీనర్ కుమ్మం అశోక్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.